చంద్రబాబుతో సోనియా గాంధీ భేటీ..?

Written By Siddhu Manchikanti | Updated: May 20, 2019 10:23 IST
చంద్రబాబుతో సోనియా గాంధీ భేటీ..?

చంద్రబాబుతో సోనియా గాంధీ భేటీ..?
 
ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతూ ఎలాగైనా ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో అధికారం దక్కకూడదని తన దగ్గర ఉన్న ప్రతి వ్యూహాన్ని వదులుతున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా యూపీఏ కూటమి మద్దతు తెలిపే పార్టీలకు దగ్గరగా మెలుగుతున్నారు చంద్రబాబు. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల చంద్రబాబు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయినట్లు సమాచారం.కొద్ది కాలం క్రితం వరకు సోనియాను దెయ్యం అని, ఇటలీ మాఫియా అని, తీవ్ర స్థాయిలో దూషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు తంటాలు పడుతున్నారు.
 
రాహుల్ ను ఒకటికి రెండుసార్లు కలిసి , ఇతర నేతలతో తాను జరిపిన చర్చల గురించి వివరిస్తున్నారు. రాహుల్ ప్రదాని అభ్యర్ధిత్వంపై మాయావతి, అఖిలేస్ యాదవ్ వంటి వారు వ్యక్తం చేసిన అబిప్రాయాలను ,అబ్యంతరాలను ఆయన వివరించారని వార్తలు వస్తున్నాయి. మరో నేత శరద్ పవార్ తో కూడా ఆయన మంతనాలు జరిపారు. ఎన్నికల ఫలితాల ముందు ఎలా వ్యవహరించాలి, ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలనే దానిపై వ్యూహరచన చేశారని చెబుతున్నారు.
Top