ఎగ్జిట్ పోల్స్ పై సెటైర్లు వేసిన జనసేన పార్టీ కార్యకర్తలు..!
ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఇటీవల విడుదల అవటం జరిగాయి. అన్నీ ఎగ్జిట్ పోల్స్ లో వైసిపి టిడిపి పార్టీ ల గురించే ప్రస్తావన ఎక్కువ వస్తున్న క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ప్ర స్టేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మొత్తం అన్ని బూటకమని బోగస్ సర్వేల్ అంటూ ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు. ఇవన్నీ వైసిపి టిడిపి పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్.. ఇలాంటి మైండ్ గేములు ప్రస్తుత తరానికి అంతా తెలుసు అంటూ వచ్చిన సర్వేలపై రెండు ప్రధాన పార్టీల పై నాయకుల పై మండి పడుతున్నారు.
ప్రస్తుతం ఏపీ మీడియా లో గోల చేస్తుంది ఆ రెండు పార్టీలకు చెందిన మీడియా చానల్స్ తప్ప మిగతా వారంతా సైలెంట్ గా ఉన్నారని పేర్కొన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మరియు సర్వేల ఫలితాలు అసలు పట్టించుకోవాల్సిన పనేలేదని.. ప్రస్తుతం వస్తున్న మీడియాల వార్తల్ని.. వాటి అనుకూల జాతీయ మీడియాల్ని నమ్మొద్దని జనసైనికులు అందరికీ సూచిస్తున్నారు. ఇకపోతే ఏపీలో 25 శాతం పైగా కాపు ఓటు బ్యాంక్ జనసేనకు ప్రధాన బలం అని నమ్ముతున్నారు. ఈసారి మునుపటితో పోలిస్తే కాపుల్లో రాజకీయంగా అవేర్ నెస్ పెరిగింది. పెంచడంలో జనసైనికులు ఎంతో కృషి చేశారు. అది ఆ పార్టీకి కలిసిరానుంది. ఆ మేరకు కాపు ఓట్లు ఇతర ప్రధాన పార్టీలకు పెద్ద గండి కొట్టనున్నాయని విశ్లేషిస్తున్నారు. సర్వేల ఫలితాలతో సంబంధం లేకుండా ఒరిజినల్ రిజల్ట్ వేరేగా ఉంటుందన్న ధీమా జనసేనలో కనిపిస్తోంది.