చంద్రబాబు, మమతా బెనర్జీ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన బిజెపి పార్టీ నేతలు…!

Written By Siddhu Manchikanti | Updated: May 21, 2019 15:57 IST
చంద్రబాబు, మమతా బెనర్జీ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన బిజెపి పార్టీ నేతలు…!

చంద్రబాబు, మమతా బెనర్జీ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన బిజెపి పార్టీ నేతలు…!
 
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇటీవల విడుదల అవటం తో జాతీయస్థాయిలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలు ప్రత్యర్థి పార్టీల నాయకుల పై సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో బిజెపి పార్టీకి దేశ ప్రజలు ఎక్కువ మొగ్గు చూపడంతో ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి గిరిరాజ్ కిషోర్ సింగ్ ప్రతిపక్ష పార్టీల నేతల పై ఊహించని కామెంట్ లు వేశారు.
 
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసిన తరువాత ప్రతిపక్ష పార్టీల నేతలు షాక్‌కి గురైయ్యారని కేంద్ర మంత్రి గిరిరాజ్ కిషోర్ సింగ్ వ్యాఖ్యానించారు.. ముఖ్యంగా బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాలను చూసి తట్టుకోలేక ఐసీయూలో చేరారని ఆయన ఎద్దేవ చేశారు. మే 23న వెలువడే ఫలితాలు మరింత స్పష్టంగా ఉంటాయి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన అబిప్రాయపడ్డారు.కేంద్రంలో 300 సీట్లతో ఎన్.డి.ఎ. అదికారంలోకి వస్తుందని అన్నారు.
Top