జగన్ కి నేను చాలా దగ్గర అంటున్న లగడపాటి రాజగోపాల్…!

Written By Siddhu Manchikanti | Updated: May 21, 2019 16:01 IST
జగన్ కి నేను చాలా దగ్గర అంటున్న లగడపాటి రాజగోపాల్…!

జగన్ కి నేను చాలా దగ్గర అంటున్న లగడపాటి రాజగోపాల్…!
 
ఆంధ్రా ఆక్టోపస్ మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వైసిపి పార్టీ అధినేత జగన్ నాకు చాలా అత్యంత దగ్గర స్నేహితుడు, సన్నిహితుడు అంటూ ఇటీవల మీడియాలో వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. లగడపాటి రాజగోపాల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..‘‘నాకు జగన్‌, చంద్రబాబు, పవన్‌ అంతా తెలుసు. జగన్‌ నాకు బాగా దగ్గర. వైఎస్‌కుటుంబంతో నాకు అనుబంధం ఉంది.
 
అదంతా వ్యక్తిగతమైన అనుబంధమే తప్ప రాజకీయంగా కాదు. నేను ఏ పార్టీలోకీ వెళ్లను. నా అంచనాలో ఎమ్మెల్యేలపై అనుకూలత, ప్రతికూలతను దృష్టిలో పెట్టుకున్నాం. అలాగే, ప్రతిపక్షాల పనితీరు, వారి పోరాటాలు.. ప్రజల ఆలోచనల్ని లోతుగా అధ్యయనం చేసి మాకు వచ్చిన అంచనాను చెబుతున్నాం. వినాలని ఎవరినీ బలవంతపెట్టడం లేదు. నేను చెప్పేది కరెక్టో కాదో 23 తర్వాత తెలుస్తుంది. ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్య ఉంది. ఇతర పార్టీల గురించి ప్రస్తావించడం అవసరం లేదనుకుంటున్నా. ఎవరి అంచనాలువారివి. ఎవరి అంచనాల్నీ నేను విభేదించను. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ప్రయత్నాలు వారివి. ఈసారి నా అంచనా తప్పితే నాపై నమ్మకం పోతుంది. మళ్లీ తప్పిందంటే నాపై విశ్వసనీయత పోతుంది. అలాగైతే నేను చెప్పే అవకాశం కూడా ఉండదు’’ అని అన్నారట.
Top