వైసీపీ పార్టీ గెలిచే ఎంపీ స్థానాలు ఇవే..?
ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నేతలు ఫలితాల కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో వైసిపి పార్టీ పార్లమెంటు స్థానాలు 18 కైవసం చేసుకోబోతున్నట్లు ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఆరు సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందని, ఒక సీటు విశాఖలో జనసేన అభ్యర్ది గెలవవచ్చని అభిప్రాయపడింది.
తాజాగా ఆ సంస్థ తన వెబ్ సైట్ లో ఈ వివరాలు వెల్లడించింది. వైసీపీగెలిచే వాటిలో తిరుపతి, నెల్లూరు, కడప, రాజంపేట, హిందూపూర్, నరసరావుపేట, నర్సాపురం, ఒంగోలు, బాపట్ల, ఏలూరు, అమలాపురం, కాకినాడ, అనకాపల్లి, కర్నూలు,నంద్యాల, అరకు, విజయనగరం సీట్లు ఉన్నాయి. ఒక్క విశాఖపట్నం ఎంపీ సీటును మాత్రం ఇండియా టుడే జనసేన ఖాతాలో వేసింది. ఇక్కడ నుంచి సీబీఐ మాజీ జెడీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, చిత్తూరు లోక్ సభ సీట్లలో మాత్రం పోటీపోటీ ఉందని ఇండియా టుడే తెలిపింది. మరో రెండు రోజుల్లోనే అసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరి ఇందులో ఇండియా టుడే అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో వేచిచూడాల్సిందే.