అసలు పవన్ కళ్యాణ్ ఎనర్జీని అంచనా వేయలేకపోతున్న సర్వేలు..?
దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చాలా చోట్ల ఎవరు గెలుస్తారు అన్నదానిపై అంచనాలు వేయగలుగుతున్న సర్వేలు ఏపీలో మాత్రం అసలు ప్రజల నాడీ ఏ విధంగా ఉందో అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా వెలువడిన సర్వేలు చూస్తే సగం తెలుగుదేశం పార్టీ రెండోసారి గెలవడం ఖాయం అంటే మరికొన్ని సర్వే కాదు జగనే ఈ సారి ముఖ్యమంత్రి అని ఎవరికి వారు ఫలితాలు ప్రకటిస్తున్నారు. మరోపక్క జనసేన పార్టీకి అసలు ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవడం కష్టమని చెబుతున్నారు. అయితే తాజాగా ఏపీ లో జరిగిన ఎన్నికల పరిణామాలను బట్టి చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 12 నుండి 14 శాతం ఓట్లు చీల్చగలడని ఈజీగానే అర్థమవుతుంది.
కొన్ని సందర్భాల్లో ప్రధాన పార్టీల నేతలే కొందరు జనసేనను తక్కువ అంచనా వేయడానికి లేదని అన్నారు. ఎందుకంటే పవన్ ఊపును వారు దగ్గర్నుండి చూశారు కాబట్టి. విశ్లేషకులు సైతం పవన్ సీట్లు గెలవలేకపోవచ్చు కానీ ఓటింగ్ శాతాన్ని పొందుతాడని చెబుతున్నారు. జనం సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇండియా టుడే, టైమ్స్ నౌ, సిపిఎస్, ఎలైట్ లాంటి బడా సర్వేలు మాత్రం పవన్ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచే పరిస్తితి లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఆ పార్టీ మాట కూడా ఉండదని తేల్చాయి. అంతేకాదు ఓటింగ్ శాతంలో జనసేన కంటే భాజాపా, కాంగ్రెస్ పార్టీలు ఉత్తమంగా ఉన్నాయని చెబుతున్నాయి. ఇక్కడే సర్వే డొల్లతనం బయటపడింది. మొత్తంమీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఎనర్జీని ఈ ఎన్నికల్లో ఏ సర్వే మరియు ఏ మీడియా ఛానల్ కూడా అంచనా వేయలేక పోయినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.