Advertisement

Advertisement

Advertisement

వరల్డ్ కప్ భారత్ క్రికెట్ జట్టు..!

by Siddhu Manchikanti | May 21, 2019 16:25 IST
వరల్డ్ కప్ భారత్ క్రికెట్ జట్టు..!

వరల్డ్ కప్ భారత్ క్రికెట్ జట్టు..!
 
మే నెల 30 వ తారీకు నుండి ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత్ క్రికెట్ జట్టు 22వ తారీఖున ఇంగ్లాండ్ కు పయనం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ భారత్ క్రికెట్ జట్టు టీం సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. గతంలో 15 మందితో జట్టును ఎంపిక చేసినా, ఇప్పుడా 15 మందితోనే ఎలాంటి మార్పులు లేని తుది జట్టును ప్రకటించారు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కేదార్ జాదవ్ ఐపీఎల్‌లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఫిట్ నెస్ సాధించడంతో తన స్థానం నిలుపుకున్నాడు. జాదవ్ ఫిట్ నెస్ సాధించకపోతే అంబటి రాయుడుకు అవకాశం దక్కేదన్న అంచనాల నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి మార్పులు లేని తుది జట్టును ప్రకటించింది.
 
ప్రపంచకప్ లో ఆడే భారత జట్టు ఇదే…
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (సెకండ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్.


Advertisement


Advertisement

Top