చంద్రబాబు ఓటమి నూరు శాతం కాదు లక్ష శాతం అంటున్నరు ..!

చంద్రబాబు ఓటమి నూరు శాతం కాదు లక్ష శాతం అంటున్నరు ..!

చంద్రబాబు ఓటమి నూరు శాతం కాదు లక్ష శాతం అంటున్నరు ..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఈసారి తెలుగుదేశం పార్టీ గల్లంతవ్వడం ఖాయమని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పొలిటికల్ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికలలో అబద్ధాలు చెప్పిన చంద్రబాబు 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రజలు ఎవరు నమ్మలేదని చంద్రబాబు ఆటలు ఇక సాగవు అదిరిపోయే తీర్పు ప్రజలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజాగా విశాఖ పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు టిడిపి పై సంచలన కామెంట్ చేశారు.
 
ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ , చంద్రబాబు నాయుడు ఓడిపోవడం లక్ష శాతం ఖాయమని అన్నారు.చంద్రబాబు వెయ్యి శాతం గెలుస్తామని చెబుతున్నారని, కాని లక్షశాతం ఆయన ఓటమి ఖాయమని దాడి వ్యాఖ్యానించారు.. ఓడిపోవడం ఖాయమని తెలిసే దేశమంతా తీర్ధయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పిలవని పేరంటానికి చంద్రబాబు నాయుడు వెళ్లడమే కాకుండా తాను ఏదో సారించేస్తానని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అందరి దగ్గరకు వెళ్లి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Top