రెండుగా చీలిపోతున్న టిడిపి అంటున్న బీజేపీ నేత..!

Advertisement

by Siddhu Manchikanti | May 22, 2019 10:07 IST
Follow Xappie
రెండుగా చీలిపోతున్న టిడిపి అంటున్న బీజేపీ నేత..!

రెండుగా చీలిపోతున్న టిడిపి అంటున్న బీజేపీ నేత..!
 
గత సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలో కొద్దిపాటి ఓట్లు సాధించి బతికిన టీడీపీ రెండోసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని తెలంగాణలో టిడిపి పార్టీ చచ్చిపోయినట్టైంది అని చాలామంది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలంగాణ టిడిపి పై కామెంట్ చేశారు. అయితే తాజాగా ఇదే పరిస్థితి ఏపీలో కూడా జరుగుతుందని పూర్తిగా టీడీపీ తుడిచి పెట్టుకోకపోయినా పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉందని బిజెపి శాసనమండలి సభ్యుడు పివిఎస్ మాదవ్ వ్యాఖ్యానించారు.
 
నిజమైన టిడిపి కార్యకర్తలు తిరుగుబాటుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. నారావారి పార్టీ, నందమూరి వారి పార్టీగా టీడీపీ చీలనుందన్నారు. రాష్ట్రంలో సైకిల్ టైరులో గాలిలేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని ఆయన అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంలో స్థానం లేదు కాబట్టే జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి చంద్రబాబే దోహద పడ్డారని, జనసేన పార్టీ చీల్చిన ఓట్లు టీడీపీవేనని ప్రజలు గమనించారన్నారు. ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు.


Advertisement


Advertisement

Top