ఎన్నికల సంఘం పై పొగడ్తల వర్షం కురిపించిన ప్రణబ్ ముఖర్జీ..!

ఎన్నికల సంఘం పై పొగడ్తల వర్షం కురిపించిన ప్రణబ్ ముఖర్జీ..!

ఎన్నికల సంఘం పై పొగడ్తల వర్షం కురిపించిన ప్రణబ్ ముఖర్జీ..!
 
దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళి గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చాలా దారుణమైన కామెంట్లు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సరిగ్గా ఎన్నికలు నిర్వహించలేదని ఇటువంటి ఎన్నికలు ఎప్పుడు కూడా దేశంలో ఎన్నడు చూడలేదు అన్నట్టుగా విమర్శల వర్షం కురిపించారు. అయితే వారికి చురకలు అంటించేలా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించడం విశేషం.
 
ఎన్నికల కమిషన్ అధ్భుతంగా పనిచేసిందని ఆయన మెచ్చుకున్నారు. తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి ఈనాటి వరకు ఎన్నికల సంఘం కమిషనర్లు అంతా బాగా పనిచేశారని ఆయన అన్నారు.చాలా సంవత్సరాల తర్వాత తాను ఓటు వేశానని ఆయన చెప్పారు. ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. పని చేయడం చేతకాని వారే పనిముట్టుపై గొడవపడతారని,పని తెలిసినవారు పనిముట్టును సజావుగా వినియోగించుకుంటారని ఆయన అనడం విశేషం. ఎన్నికల కమిషనర్ల ను ప్రభుత్వాలే నియమిస్తాయని ఆయన అన్నారు.ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంస్థలు పట్టుగొమ్మలవంటివని ఆయన అన్నారు.Top