విజయవాడ నుండి ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్న జనసేన అధినేత పవన్..?

Advertisement

by Siddhu Manchikanti | May 22, 2019 10:20 IST
Follow Xappie
విజయవాడ నుండి ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్న జనసేన అధినేత పవన్..?

విజయవాడ నుండి ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్న జనసేన అధినేత పవన్..?
 
2019 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇటీవల విడుదలవటం జరిగాయి. బయటకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉన్నా కానీ జనసేన పార్టీకి మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితం అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విషయంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సెటైర్లు వేయడం జరిగింది. ఎవరికి వారే సొంతంగా చేసుకొనే సర్వేలో వారికి అనుగుణంగా ఫలితాలు వచ్చేలా చూసుకున్నారని..కానీ జనసేన పార్టీ మాత్రం ప్రజల నాడిని నమ్మింది అని కచ్చితంగా 2019 ఎన్నికల్లో ఒక సైలెంట్ విప్లవం జనసేన పార్టీ సృష్టించిందని అది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ ఫలితాలు వచ్చే వరకు విజయవాడ లోనే అందరికి అందుబాటులో ఉంటూ రాబోయే ఫలితాల ద్వారా రాష్ట్రంలో ఏం చేయాలి అన్న దానిపై స్పష్టమైన ఆపరేషన్ ఇప్పటికే స్టార్ట్ చేసుకున్నట్లు జనసేన పార్టీలో వినబడుతున్న టాక్. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రెండు పార్టీలకు దిమ్మతిరిగిపోయే విధంగా జనసేన పార్టీ వేసే రాజకీయ అడుగులు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తాయని కామెంట్లు చేస్తున్నారు పార్టీకి చెందిన వారు. అంతేకాకుండా కౌంటింగ్ రోజు పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు ఎలాంటి దాడులకు తెగబడిన వాటిని ఎదుర్కోవాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు, కౌంటింగ్ ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. మొత్తంమీద విజయవాడ నుండి పోలింగ్ రిజల్ట్ వచ్చే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు పరిస్థితుల బట్టి తెలుస్తోంది.


Advertisement


Advertisement

Top