ఉభయగోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఏ టాపు..!

Written By Siddhu Manchikanti | Updated: May 24, 2019 11:13 IST
ఉభయగోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఏ టాపు..!

ఉభయగోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఏ టాపు..!
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ కి అధికారం కోల్పోవడం గల ప్రధాన కారణాలలో ఒక కారణం రెండు గోదావరి జిల్లా ప్రజాలు. గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న ప్రజలు ఆదరించడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కనీసం ఒక్క స్థానం కూడా వైయస్సార్సీపి పార్టీకి రాలేదు. అయితే తాజాగా జరిగిన 2019 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఏ టాపు స్థానాలను కైవసం చేసుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
 
గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన ఈ రెండు జిల్లాలకు కనీస అభివృద్ధి చంద్రబాబు హయాంలో జరగకపోవడంతో తాజాగా జరిగిన ఎన్నికలలో తమ కసితీరా చంద్రబాబు ప్రభుత్వం పై ఓటు ద్వారా బుద్ధి చెప్పారని చాలా మంది విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఒక్క ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే కాకుండా రాష్ట్రంలో స్పష్టంగా వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం కనబడటం నిజంగా వైసీపీ పార్టీ అధినేత జగన్ పడిన కష్టానికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top