పాపం చంద్రబాబు ని చూస్తే జాలేస్తుంది అంటున్న వైసీపీ నేత..!

Advertisement

by Siddhu Manchikanti | May 24, 2019 11:17 IST
Follow Xappie
పాపం చంద్రబాబు ని చూస్తే జాలేస్తుంది అంటున్న వైసీపీ నేత..!

పాపం చంద్రబాబు ని చూస్తే జాలేస్తుంది అంటున్న వైసీపీ నేత..!

2019 ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి అందరు షాక్ తింటున్నారు. ముఖ్యంగా తాజాగా వచ్చిన ఫలితాలు తెలుగుదేశం పార్టీని కోలుకోలేని విధంగా చేశాయి అంటూ చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఉండగా తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాలను గురించి మాట్లాడుతూ..ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా తమ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. మరో 24 గంటల్లో రాష్ట్రంలో రాజన్న పాలనా రాబోతుందని చెప్పారు. సొంత వదినను చంపిన దేవినేని ఉమామహేశ్వరావు, బుద్ధిలేని బుద్ధా వెంకన్నలు మీడియా ముందుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.


Advertisement


Advertisement

Top