పులివెందుల లో గత ఎన్నికల కంటే మెజారిటీ సాధించిన జగన్..!

పులివెందుల లో గత ఎన్నికల కంటే మెజారిటీ సాధించిన జగన్..!

పులివెందుల లో గత ఎన్నికల కంటే మెజారిటీ సాధించిన జగన్..!
 
వైసిపి పార్టీ అధినేత జగన్ పోటీ చేసిన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తాజాగా జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. కడప పులివెందుల అంటే వైయస్ కుటుంబానికి కంచుకోట అయితే 2014 ఎన్నికల కంటే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ 90,543 ఓట్లు మెజారిటీ సాధించడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
 
2019 ఎన్నికల్లో కడప జిల్లాలో మరియు కర్నూలు జిల్లాలలో వైసీపీ పార్టీ మొత్తం అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం నిజంగా రికార్డని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జరిగిన ఎన్నికలలో తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. నిజంగా జగన్ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పాదయాత్ర సమయంలో తనపై దాడి జరిగిన ఏమాత్రం బెదరకుండా పార్టీని నడిపించి ఏపీలో 40 ఏళ్ల రాజకీయ చాణిక్య రాజకీయ నాయకుడు అని అనిపించే చంద్రబాబును ఎదుర్కొనే దేశం మొత్తం ఏపీ వైపు చూసే విధంగా విజయం సాధించడం... కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించడం జగన్ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం అని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు.Top