ఆరు నెలలు లోపే ది బెస్ట్ సీఎం జగన్ అని ప్రజల చేత అనిపించుకుంటా: జగన్..!
2019 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలదన్నేలా ఏపీ ప్రజలు వైసీపీ పార్టీ కి పట్టం కట్టారు. దాదాపు 150కి పైగా అసెంబ్లీ స్నానాలు మొత్తం పార్లమెంట్ స్థానాలు జగన్ కి కట్టబెట్టారు. దీంతో 2019 ఎలక్షన్స్ వార్ వన్ సైడ్ అయిపోయింది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ చరిత్రను సృష్టించే విధంగా స్థానాలు గెలవడంతో 2019 ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దీంతో జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటంతో రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సి ఎస్ ఎల్వీ సుబ్రమణ్యం జగన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ప్రజలు మరియు దేవుడు తనకు ఇచ్చిన ఈ విషయాన్ని చాలా బాధ్యతగా తీసుకుంటున్నట్లు..రాష్ట్రంలో ఒకరికి మాత్రమే ఇలాంటి స్థానం రావటం జరుగుతుందని..తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేదవాడి కోసం ఒక అడుగు వేస్తే నేను నాలుగు అడుగులు వేస్తాను అంటూ.. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నవరత్నాలను ప్రతి ఒక్కరికీ అందేలా కార్యక్రమాలు ఉంటాయని ఆరు నెలలు లోపే జగన్ ది బెస్ట్ సీఎం అని రాష్ట్ర ప్రజల చేత అనిపించుకునేలా కృషి చేస్తానని జగన్ పేర్కొన్నారు.