చాలా గ్రాండ్ గా జగన్ కి స్వాగతం పలికారు కేసీఆర్..!

Written By Siddhu Manchikanti | Updated: May 26, 2019 10:50 IST
చాలా గ్రాండ్ గా జగన్ కి స్వాగతం పలికారు కేసీఆర్..!

చాలా గ్రాండ్ గా జగన్ కి స్వాగతం పలికారు కేసీఆర్..!
 
ఎపి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న వైఎస్ జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి అద్బుతమైన స్వాగతం లభించింది.ఆయన స్వయంగా ఎదురేగి స్వాగతం చెప్పడం విశేషంగా కనిపిస్తుంది.కెసిఆర్ , టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ లు స్వయంగా జగన్ దంపతులను సాదరంగా ఇంటిలోకి తీసుకు వెళ్లారు. అంతేకాక జగన్ కు కెసిఆర్ స్వీట్ తినిపించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి ఎంతో అబిమానం కనబరిచారు. గవర్నర్ నరసింహన్ ను కలిసిన తర్వాత జగన్ తన సహచరులతో కలిసి నేరుగా కెసిఆర్ ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ కెసిఆర్ వారిని రిసీవ్ చేసుకుని మంత్రులను , స్పీకర్ ను పరిచయం చేశారు.
 
జగన్ కు కెసిఆర్ దుశ్శాలువా కప్పి సత్కరించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక జ్ఞపికను అందచేశారు. కెసిఆర్ సతీమణి, కెటిఆర్ సతీమణి కూడా జగన్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. కెటిఆర్ సతీమణి జగన్ సతీమణి భారతికి సంప్రదాయబద్దంగా బొట్టు పెట్టారు. భారతి కూడా ఆమెకు బొట్టుపెట్టారు. ఈ నెల ముప్పైన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 12.23 నిమిషాలకు జగన్ ప్రమాణం చేయనున్న సందర్భంగా కెసిఆర్ కుటుంబాన్ని జగన్ దంపతులు ఆహ్వానించారు.
Top