పోలవరం ప్రాజెక్టు కు కొత్తపేరు..?

పోలవరం ప్రాజెక్టు కు కొత్తపేరు..?

పోలవరం ప్రాజెక్టు కు కొత్తపేరు..?
 
తాజాగా ఇటీవల తాడేపల్లి లో పార్టీ కార్యాలయంలో తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం అయ్యారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని బందరు నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యుడు వి.బాలశౌరి కోరారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ కల అని ఆయన అన్నారు.
 
ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిదులు తేవడం కాని, కాల్వలు తవ్వంచడం కాని ఆయనే చేశారని ,అందువల్ల వైఎస్ పేరు పెట్టాలని ఆయన కోరారు. జగన్ పై విశ్వాసం వల్లే భారీగా ఆదిక్యత ఇచ్చారని ఆయన అన్నారు. కాగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి కూడా పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలని కోరారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.Top