జగన్ ప్రమాణ స్వీకారం ప్లేస్ అండ్ టైం ఫిక్స్..!

జగన్ ప్రమాణ స్వీకారం ప్లేస్ అండ్ టైం ఫిక్స్..!

జగన్ ప్రమాణ స్వీకారం ప్లేస్ అండ్ టైం ఫిక్స్..!
 
ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు కూడా అందనంత స్థాయిలో ఏపీ ప్రజలు వైసీపీ అధినేత జగన్ కు పట్టం కట్టారు. 2019 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాలు సృష్టించాయి అని అనటంలో ఎటువంటి సందేహాలు లేవు. నువ్వా నేనా అన్నట్టుగా వైసీపీ టీడీపీ పార్టీల మధ్య తాజా సార్వత్రిక ఎన్నికల పోరు నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు మాత్రం వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరియు ఇతర పార్టీల నాయకులకు దిమ్మతిరిగిపోయే విధంగా ఉందని చాలామంది రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
జగన్ ప్రమాణ స్వీకారానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వేదికను నిర్ణయించారు. రెండురోజులపాటు వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక కోసం అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేషన్ సభ్యులు పలు వేదికలను పరిశీలించారు. చివరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను ప్రభుత్వంతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎంపిక చేశారు.ఈనెల 30న ఉదయం 11.40 నిమిషాలకు వైయస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఒకే కావడంతో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
 
వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రలు సైతం హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియంను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విజయవాడ నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు ను చీఫ్ సెక్రటరీ య యల్ వి సుబ్రమణ్యం ఆదేశించారు.Top