ఆ సమయంలో నాన్న గుర్తుకు వచ్చాడు అంటున్న జగన్..!

Advertisement

by Siddhu Manchikanti | May 28, 2019 09:59 IST
Follow Xappie
ఆ సమయంలో నాన్న గుర్తుకు వచ్చాడు అంటున్న జగన్..!

ఆ సమయంలో నాన్న గుర్తుకు వచ్చాడు అంటున్న జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా మెజార్టీ స్థానాలు గెలిచి తన చిరకాల ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించిన వైసీపీ పార్టీ అధినేత జగన్ ఈనెల 30వ తారీఖున విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక సమస్యలపై కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాష్ట్ర అధికారులతో ఐఏఎస్ ఐపీఎస్ ల తో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఘన విజయం తరువాత మీకేమనిపించింది అంటూ ఓ మీడియా ప్రతినిధి ఇటీవల జగన్‌ను ప్రశ్నించారు. దానికి స్పందించిన జగన్.. ఇంతటి అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా నాన్నను తలుచుకున్నా. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు అంటూ సమాధానం ఇచ్చారు.
 
ఇక కాంగ్రెస్ అధిష్టానం తన తప్పు తెలుసుకొని, మిమ్మల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలని నేను అనుకోవడం లేదు. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. నాకు తెలిసి కాంగ్రెస్‌ను ఎప్పుడో క్షమించేశా. ఇప్పుడు నా దృష్టంతా రాష్ట్రంపైనా.. నా ప్రజలపైన మాత్రమే ఉంది అంటూ జగన్ తెలిపారు.


Advertisement


Advertisement

Top