దేశం కోసం ఎందాకైనా వెళ్తా అంటున్న సోనియాగాంధీ..!

Written By Siddhu Manchikanti | Updated: May 28, 2019 10:14 IST
దేశం కోసం ఎందాకైనా వెళ్తా అంటున్న సోనియాగాంధీ..!

దేశం కోసం ఎందాకైనా వెళ్తా అంటున్న సోనియాగాంధీ..!
 
2019 దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో 2014 కంటే ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలిచి కేంద్రంలో మరొకసారి అధికారాన్ని చేపట్టింది బిజెపి పార్టీ. జరిగిన ఎన్నికల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలి నుండి మరొక సారి గెలవడం జరిగింది. అయితే యూపీలో మొత్తం 81 స్థానాలు ఉండగా కేవలం ఒకే ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖను విడుదల చేశారు.
 
భారతదేశ విలువలను కాపాడేందుకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని..ఎందాకైనా వెళ్తా అంటూ తనను మరోసారి ఎన్నుకున్నందుకు రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని లేఖలో వెల్లడించారు. దేశపు విలువలను కాపాడతానని మీకు ప్రమాణం చేస్తున్నానని.. అవసరమైతే నాకు మిగిలిందంతా త్యాగం చేయడంలో వెనకడుగు వేయనని.. రానున్న రోజులు కష్టంగా ఉండబోతున్నాయన్న సంగతి నాకు తెలుసని అన్నారు. కానీ మీరు నా వెనుక ఉన్నారన్న బలం, నాపై మీ నమ్మకం.. నన్ను నడిపిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
Top