కొత్త పార్టీ పెడతాను అంటున్న ప్రకాష్ రాజ్..!

Written By Siddhu Manchikanti | Updated: May 28, 2019 10:21 IST
కొత్త పార్టీ పెడతాను అంటున్న ప్రకాష్ రాజ్..!

కొత్త పార్టీ పెడతాను అంటున్న ప్రకాష్ రాజ్..!
 
తాజాగా ఇటీవల జరిగిన దేశవ్యాప్త ఎన్నికలలో బెంగళూరు నగరం నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దారుణంగా ఓడిపోయాడు. ఈ గ్రామంలో ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో ఓడిపోయినా గాని బెంగళూరు ప్రజల సమస్యలను లేవనెత్తడానికి పరిష్కరించడానికి ఎప్పుడూ ముందుంటానని.. ఇండిపెండెంట్ గా ప్రజలు తనను గుర్తించలేకపోయారు నాకు ప్రజలకు మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చిందని పేర్కొన్నారు.
 
ఇంకా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడతానని.. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దింపుతానని ప్రకటించారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ పెట్టినా కూడా సినిమాల్లో నటించడం మాత్రం మాననంటూ స్పష్టం చేశారు. కాగా రాజకీయ పార్టీని నడిపేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి.. అందుకోసమే తాను సినిమాల్లో నటిస్తానని చెప్పినట్లు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన కొద్దిరోజులకే సొంతంగా పార్టీ పెడతానని ప్రకాష్ రాజ్ చెప్పడం ఇప్పుడు కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Top