మళ్లీ మంగళగిరి నుండి అంటున్న నారా లోకేష్..!

Written By Siddhu Manchikanti | Updated: May 28, 2019 10:29 IST
మళ్లీ మంగళగిరి నుండి అంటున్న నారా లోకేష్..!

మళ్లీ మంగళగిరి నుండి అంటున్న నారా లోకేష్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రజాక్షేత్రంలో తనను తాను నిరూపించుకోవాలని మంగళగిరి నియోజకవర్గం నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అయితే మంగళగిరి ప్రజలు మాత్రం నారా లోకేష్ ని చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి సారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో ముచ్చటించారు. ముందు నుండి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేద్దామని తీసుకున్న నిర్ణయం సమయంలోనే చాలామంది రాంగ్ డెసిషన్ అని అన్నారు.
 
కానీ ఎలాగైనా రాజధాని ప్రాంతంలో నియోజకవర్గంలో గెలిచి తీరాలి అని అనుకున్న కానీ ప్రజలను గుర్తించలేదని పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తనని కలిసిన మంగళగిరి ప్రజలకు తెలియజెప్పారు. ఇటీవల టిడిపి కార్యకర్తలతో నాయకులతో ఉండవల్లి తో భేటీ అయిన నారా లోకేష్.. తన ఓటమికి కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుని మనకి పార్టీ అండగా ఉందని అన్నారు.
Top