'ఫోన్ చేసి పిలిచాడుగా వెళ్దాం' చంద్రబాబు నిర్ణయం? ప్రమాణ స్వీకరానికి రెడీ?

Advertisement

by Siddhu Manchikanti | May 29, 2019 17:24 IST
Follow Xappie
'ఫోన్ చేసి పిలిచాడుగా వెళ్దాం' చంద్రబాబు నిర్ణయం? ప్రమాణ స్వీకరానికి రెడీ?

'ఫోన్ చేసి పిలిచాడుగా వెళ్దాం' చంద్రబాబు నిర్ణయం? ప్రమాణ స్వీకరానికి రెడీ?
 
2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అత్యద్భుతంగా గెలిచిన వైసీపీ పార్టీ అధినేత జగన్ మే 30 వ తారీఖున విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం 12 గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తన చిరకాల ప్రత్యర్థి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని ఈ కార్యక్రమానికి పిలుస్తారా లేదా అన్న సందిగ్దత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో పాటు ప్రజలకు కూడా నెలకొంది.
 
దాదాపు పది సంవత్సరాల పాటు తనను..తన కుటుంబాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడిని కచ్చితంగా ఈ కార్యక్రమానికి జగన్ ఆహ్వానం పత్రిక పంపారు అని అందరూ అనుకున్నారు. కానీ జగన్ అందరి ఆలోచనను తలకిందులు చేస్తూ స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు కి ఫోన్ చేసి మరి కుటుంబ సమేతంగా తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కోరారట. దీంతో జగన్ నుంచి ఫోన్ కాల్ అందుకున్న చంద్రబాబు..జగన్ ముఖ్యమంత్రి కల నెరవేరాలని ఆయన చేసిన కృషికి తగిన ఫలితాన్ని బట్టి జగన్ ని ఫోన్ లో అభినందించారట.
 
ఈ క్రమంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుమీరు కూడా రావాలని చంద్రబాబు కి జగన్ తెలిపిన ఆహ్వానపత్రికను అందుకున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ కార్యక్రమానికి వెళ్లాలో లేదో అన్న సందిగ్దంలో ఉండగా.. ఫోన్ చేసాడు కాబట్టి వెళితే బాగుంటుంది అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు టిడిపి వర్గాల నుండి వస్తున్న సమాచారం.


Advertisement


Advertisement

Top