ఈయనకే జగన్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రి పదవి - డౌటే లేదు!

Advertisement

by Siddhu Manchikanti | May 29, 2019 17:31 IST
Follow Xappie
ఈయనకే జగన్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రి పదవి - డౌటే లేదు!

ఈయనకే జగన్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రి పదవి - డౌటే లేదు!
 
మరికొద్ది గంటల్లో విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన చిరకాల కల నెరవేర్చుకోభోతున్నారు వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్. 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అందరూ ఊహించని రీతిలో అద్భుతమైన మెజారిటీ స్థానాలు గెలిచి ప్రత్యర్థి పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించారు. పాదయాత్ర నుండి పక్కా స్కెచ్ వేసుకుని తెలుగు దేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో బయటకు తీసుకువచ్చి టిడిపిని అసెంబ్లీ స్థానాలలో 23 స్థానాలకు పరిమితం చేసి పార్లమెంట్ స్థానాలలో మూడు తో చక్కబెట్టారు.
 
ముఖ్యంగా జరిగిన ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మొట్టమొదటిసారి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన క్రమంలో నారా లోకేష్ పోటీ ఆంధ్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. నారా లోకేష్ పై వైసీపీ పార్టీ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణా రెడ్డి ని గెలిపిస్తే ఆర్కేకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని సభాముఖంగా జగన్ హామీ ఇచ్చారు.
 
అయితే జరిగిన ఎన్నికలలో నారా లోకేష్ ని దారుణంగా చిత్తు చిత్తుగా ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవడంతో ఇప్పుడు ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కువగా వ్యవసాయం చేస్తారు కాబట్టి వ్యవసాయంపై ఎక్కువ అవగాహన ఉన్న క్రమంలో సొంత పొలాన్ని తానే సొంతంగా పండిస్తూ సాదాసీదా నాయకుడిగా వ్యవహరించే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి జగన్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వటం గ్యారెంటీ అని ఏమాత్రం డౌట్ లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Advertisement


Advertisement

Top