జగన్ తీసుకున్న ఆ నిర్ణయానికి ఫిదా అయిపోయిన టీడీపీ లీడర్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీ టిడిపి నేతలకు ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. గత పది సంవత్సరాలు తనని తన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై జగన్ అధికారంలోకి వస్తే వాళ్ల పని అయిపోతుందని చాలామంది అప్పట్లో జగన్ అధికారంలోకి రాక ముందే జగన్ ఒక ఫ్యాక్షనిస్టు లీడర్ గా అనేక మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే కామెంట్లు చేసేవారు.
అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 8 ఫ్యాక్షనిస్టు కుటుంబాలకు ఫుల్ సెక్యూరిటీ కల్పించారట. ముఖ్యంగా అనంతపురం జిల్లా పరిటాల కుటుంబానికి ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని డిఐజికి జగన్ ఆదేశాలు జారీ చేశారట. దీంతో జగన్ అధికారంలోకి వస్తే బిక్కుబిక్కుమంటూ రాయలసీమ ప్రాంతంలో భయపడుతున్న కుటుంబాలు జగన్ మైండ్ సెట్ మారిందని ...ఈ విధంగా జగన్ రాజకీయాల్లో రాణించారంటే వైయస్ నే మించిపోతారు అని టీడీపీ నేతలే కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రాయలసీమ ప్రాంతంలో గొడవలు జరగకుండా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ నేతలు ఫిదా అయిపోయారు.