ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటున్న ఏపీ సీఎం జగన్..!

ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటున్న ఏపీ సీఎం జగన్..!

ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటున్న ఏపీ సీఎం జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు వైసీపీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశాక జగన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో నా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పెద్ద వైరల్ గా మారింది . ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని దాదాపు 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నట్లు తర్వాత లక్షన్నరకు పైగా ఉద్యోగాలు వస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.
 
అంతేకాకుండా ప్రభుత్వ పరంగా వచ్చే వార్తలను వక్రీకరిస్తూ కొంతమందిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆలోచించి తమకు ఇష్టం వచ్చినట్లుగా మీడియాలో వార్తలు ప్రచురిస్తూ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వేదికపైనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తం బయటకు లాగా ల్సిన పని ఉందని ….తప్పు జరిగితే కఠిన చర్యలు తప్పవని ...చట్టం పని చట్టం చేసుకుంటూ వెళ్ళిపోతుందని స్పష్టం చేశారు జగన్.Top