ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవాడ నడిబొడ్డున మే 30 వ తారీకున మధ్యాహ్నం 12 గంటల ఇరవై మూడు నిమిషాలకు అతిరధులు మహారధులు...కుటుంబ సభ్యుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు వైసీపీ పార్టీ అధినేత జగన్. ఈ సందర్భంగా అసలే విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రం పైగా గత ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసి రాష్ట్ర ఖజానాలో ఏ మాత్రం లేకుండా కేవలం 100 కోట్లు మిగిల్చిన. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ రాష్ట్రంలో అన్ని ఆర్థిక పరిస్థితులను ఎరిగి ఏమాత్రం దుబారా ఖర్చులకు పోకుండా తన ప్రమాణ స్వీకారాని సింపుల్ గా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందని జగన్ అడిగినప్పుడు.. కనీసం 5 నుంచి 10 లక్షల మధ్య అవుతుందని ఎల్వీ చెప్పారట. దీంతో జగన్ అలా అవడానికి వీలులేదు.
రూ. 2 లక్షలకు మించకుండా ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడని వైసీపీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మునిసిపల్ స్టేడియం ఎలాగూ ప్రభుత్వానిదే.. కుర్చీలను మునిసిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. వచ్చే వారికి ప్రభుత్వ అతిధి గృహాల్లో బస ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ ఖర్చు ను తగ్గించుకునేందుకు జగన్ వేసిన అడుగులు రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులతో పాటు పార్టీ నేతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏది ఏమైనా నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ తనదైన శైలిలో సుపరిపాలనకు బంగారు అడుగులు వేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.