ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు చూస్తుంటే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా తమ దైనందిన జీవితాల్లో పనులు చేసుకోవడానికి ఎండకి జంకుతున్నారు. ఇటువంటి క్రమంలో జూన్ మొదటి వారం లోనే రాష్ట్రాన్ని రుతుపవనాలు కాబోతున్నట్లు...రాష్ట్రాన్ని చిరుజల్లులు పలకరించనున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. జూన్ 8 లేదా 9వ తేదీల్లో రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి రుతుపవనాలు తాకనున్నాయని తెలిపింది. దీని కారణంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. ఈ రుతుపవనాలు ఏపీ కంటే ముందుగా జూన్ 4 లేదా 5వ తేదీల్లో కేరళను తాకనున్నాయని తెలిపింది. ఈ వార్త తెలియడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతగానో సంతోషపడుతున్నారు.