జగన్ మర్యాదలకు ఫిదా అయిపోతున్న ఉద్యోగులు..!

Written By Siddhu Manchikanti | Updated: June 02, 2019 10:03 IST
జగన్ మర్యాదలకు ఫిదా అయిపోతున్న ఉద్యోగులు..!

జగన్ మర్యాదలకు ఫిదా అయిపోతున్న ఉద్యోగులు..!
 
సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ పనుల్లో బిజీ అయ్యారు. సెక్రటేరియట్ ఇంకా రెడీ కాకపోవటంతో తాడేపల్లిలోని ఇంటి నుంచే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు సీఎం జగన్. మూడు రోజులుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వివిధ శాఖల అధికారులతో ఇంట్లో ఉండే సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో సమీక్ష చేస్తున్న అధికారులకు ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లోనే అధికారులు, ఉన్నతాధికారులకు భోజనాలు ఏర్పాటు చేయాలని, తాను ఏం తింటానో అది అందరికీ పెట్టాలని ఆదేశించారంట సీఎం జగన్. మధ్యాహ్నం సమయంలో సమీక్షలు చేసే అధికారులు షాక్ కు గురి అవుతున్నారు.
 
గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యవహరించలేదని.. గంటలు గంటలు సమీక్షలు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చావకొట్టేవారని చెప్పుకుంటున్నారు అధికారులు. సమీక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయినా.. గంటలోనే క్లోజ్ చేస్తున్నారని.. సూచనలు, సలహాలు, అమలులో సాధ్యసాధ్యాలు ఏంటో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ గడువు ఇచ్చి పంపుతున్నారని చెప్పుకుంటున్నారు అధికారులు. మాట్లాడే సమయంలో ఆయన పిలుపు, మాటతీరు కూడా మనస్సుకు హత్తుకునే విధంగా ఉంటుందని.. గతంలోని సీఎంలతో పోల్చి చూసుకుని హ్యాపీ ఫీలవుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయం అయితే మాత్రం రండి.. భోజనం చేద్దాం.. ఆ తర్వాత మాట్లాడుకుందాం.. తిన్న తర్వాత మిగతా సమీక్ష చేద్దాం అని స్వయంగా ఆహ్వానిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఉద్యోగులు.
Top