ఇది గనక చేస్తే జగన్ ని ఎవ్వడూ ఆపలేడు!

ఇది గనక చేస్తే జగన్ ని ఎవ్వడూ ఆపలేడు!

ఇది గనక చేస్తే జగన్ ని ఎవ్వడూ ఆపలేడు!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్ పాలనలో తన మార్క్ ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మరియు పాదయాత్ర సమయంలో చాలా కుటుంబాలకు చెందిన మహిళలు తమ భర్తలు మద్యానికి బానిసై కుటుంబాలను పట్టించుకోవడంలేదని పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదని రాష్ట్రంలో ఉన్న మహిళలు గత ప్రభుత్వాల పై పోరాటం చేస్తున్న జగన్ దృష్టికి మద్యపాన నిషేధాన్ని తీసుకు వచ్చిన క్రమంలో.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా మద్యపానాన్ని నిషేధించాలని చంద్రబాబు ప్రభుత్వం పై పోరాడిన జగన్ ఇప్పుడు అధికారంలోకి రావడంతో మద్యపాన నిషేధం పై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గానే దశలవారీగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం చెయ్యాలని అధికారులకు ఇటీవల సూచించారు.
 
అయితే, ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో సవాళ్ళతో కూడుకున్న విషయం. పైగా, ఖజానా నిండాలంటే మద్యం ఏరులై పారాల్సిందేనన్న భావనతో గత ప్రభుత్వం పనిచేసిన దరిమిలా, ఖజానాపై ఎలాంటి భారం పడకుండా మద్య నిషేధం వైపు అడుగులు వేయాల్సి వుంటుంది. ఇంతటి సంక్లిష్టమైన ప్రక్రియలో వైఎస్‌ జగన్‌ గనుక విజయం సాధిస్తే, అదొక చారిత్రక ఘట్టమవుతుంది. 'ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటాం..' అని అధికారుల సమీక్షలో పదే పదే వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానిస్తున్న దరిమిలా, సరికొత్త ఆంధ్రప్రదేశ్‌ని రాష్ట్ర ప్రజలు కొద్ది నెలల్లోనే అనుభూతి చెందే అవకాశం సుస్పష్టంగా కన్పిస్తోందని ధీమాగా చెప్పొచ్చేమో. రాష్ట్రము అప్పుల ఊబిలో ఉన్నా కానీ జగన్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం సక్సెస్ ఫుల్ గా చేస్తే జగన్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని జగన్ ని ఎవరూ ఆపలేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top