సుజనా చౌదరి అరెస్ట్..?

Written By Siddhu Manchikanti | Updated: June 02, 2019 10:09 IST
సుజనా చౌదరి అరెస్ట్..?

సుజనా చౌదరి అరెస్ట్..?
 
బ్యాంకుల దగ్గర తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు కంపెనీలు చూపించి రుణాలు తీసుకుని తర్వాత రుణాలు ఎకొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహాదారుడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పై ఇటీవల బెంగళూరుకి చెందిన సీబీఐ అధికారులు సుజనా చౌదరి కార్యాలయంపై రెండు ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు సోదాల్లో పలు పత్రాలు మరియు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.
 
సుజనా చౌదరితో అనుబంధంగా ఉన్న బెస్ట్ అండ్ క్రోప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బిసిఎల్ఎల్) 2017 లో రూ. 71 కోట్లకు ఆంధ్రా బ్యాంక్ను మోసం చేసిన ఆరోపణలను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా ఈ కేసులో చెన్నైకి చెందిన కంపెనీ, దాని ఐదుగురు డైరెక్టర్లు నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితులు మరియు వస్తున్న ఆరోపణలు బట్టి సుజనా చౌదరి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా సుజనా చౌదరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు చాలామంది రాజకీయ నాయకులు.
Top