'మాకొద్దు చంద్రబాబు - తారక్ రావాల్సిందే' టీడీపీ శ్రేణుల తీర్పు ఇదేనా??

Written By Siddhu Manchikanti | Updated: June 02, 2019 10:15 IST
'మాకొద్దు చంద్రబాబు - తారక్ రావాల్సిందే' టీడీపీ శ్రేణుల తీర్పు ఇదేనా??

'మాకొద్దు చంద్రబాబు - తారక్ రావాల్సిందే' టీడీపీ శ్రేణుల తీర్పు ఇదేనా??
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీ ఇక కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయాలు వల్లే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ స్థితికి చేరింది అంటూ తెలుగుదేశం పార్టీని ఎక్కువగా ప్రేమించే చాలా మంది సీనియర్లు కామెంట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు వల్ల తెలుగుదేశం పార్టీ చచ్చిపో వలసిన పరిస్థితి వచ్చిందని... తన రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించారని టీడీపీ పతనానికి కారణం చంద్రబాబేనని చాలామంది అంటున్నారు.
 
అయితే ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం రావాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు చేతిలో తెలుగుదేశం పార్టీ ఉంటే నామరూపాలు లేకుండా పోతుందని.. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు చేతిలో నుండి జూనియర్ ఎన్టీఆర్ తీసుకుని పగ్గాలు చేపట్టాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు “మాకొద్దు చంద్రబాబు... తారక్ రావాల్సిందే” అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇదే క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తనది ఒక్కడిది మాత్రమే కాదని చెబుతన్న వర్మ... ఈ విషయంపై ఆన్ లైన్ పోల్ నిర్వహించానని అందులో పాలుపంచుకున్న నెటిజన్లలో ముప్పావు మంది తారక్ నే కోరుకుంటున్నారని కూడా వర్మ చెబుతున్నారు. అలా చంద్రబాబు ప్లేస్ లో తారక్ ఉండాలని కోరుకుంటున్న వారిలో టీడీపీ నేతలు కూడా ఉన్నారని చెబుతూ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తక్షణమే టీడీపీ పగ్గాలను తారక్ చేతిలో పెట్టాలని అప్పుడే పార్టీ బతికి బట్ట కడుతుందని చెబుతూ ఓ సంచలన ట్వీట్ ను విడుదల చేశారు.
Top