గవర్నర్ నరసింహన్ మీద తిరుగుబాటు మొదలైంది ?

గవర్నర్ నరసింహన్ మీద తిరుగుబాటు మొదలైంది ?

గవర్నర్ నరసింహన్ మీద తిరుగుబాటు మొదలైంది ?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతరేతర విషయాలు విడిపోయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల కు ఒకే గవర్నర్ గా ఉంటున్నారు నరసింహన్. గత కొంత కాలం నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ తీరు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నరుగా నియమితులైన నరసింహన్..కేంద్రంలో రెండు సార్లు ప్రభుత్వం మారిన ఆయన మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా నే ఉండటం నిజంగా ఆశ్చర్యం అని చెప్పవచ్చు.
 
గత రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా తనకు ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారంటే.. బాగానే పనిచేస్తున్నట్లు కదా. అలాంటి సమర్థవంతమైన గవర్నర్ పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు తనదైన శైలిలో నోరు పారేసుకున్నారు. గవర్నర్ గా నరసింహన్ చేస్తున్న పని ఇదేనని కూడా వీహెచ్ తనదైన సెటైర్లు సంధించారు. రెండు రాష్ట్రాల సీఎంలకు భజన చేయడం - గుళ్లు పట్టుకుని తిరగడం తప్పించి గవర్నర్ గా నరసింహన్ చేస్తున్న పనేమీ లేదని వీహెచ్ కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో దళితులపై దాడులు జరిగినా... రైతులకు సంకెళ్లు పడినా... గవర్నర్ చోద్యం చూస్తున్నారు తప్పించి కనీసం స్పందిస్తున్న దాఖలా కూడా లేదని కూడా వీహెచ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని గవర్నర్ పట్టించుకోవడంలేదని అలాంటి గవర్నర్ ఉండి ఏం లాభం అని విహెచ్ అంటున్నారు. ఇంకా ఇలాంటి గవర్నర్..పదవిలో ఇంకా కొనసాగితే తిరుగుబాటు చేస్తామని..మరికొంతమంది టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.Top