జగన్ ఈ ఒక్క విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చూడాల్సిందే !

Written By Siddhu Manchikanti | Updated: June 03, 2019 10:05 IST
జగన్ ఈ ఒక్క విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చూడాల్సిందే !

జగన్ ఈ ఒక్క విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది చూడాల్సిందే !
 
తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నారు వైసిపి పార్టీ అధినేత జగన్. 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలలో బలమైన తెలుగుదేశం పార్టీని మరియు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని చిత్తుచిత్తుగా ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు వైసీపీ అధినేత జగన్. అయితే క్లిష్ట పరిస్థితుల్లో జగన్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని..రాష్ట్రానికి సంబంధించిన ఆర్ధిక పరిస్థితి చూస్తే చాలా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని..ఇటువంటి క్రమంలో ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించిన నవరత్నాలు హామీలను ఎలా నెరవేర్చుతారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
 
జగన్ ఈ ఒక్క విషయాన్ని అనగా నవరత్నాల హామీల విషయాలను ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు జగన్ ముందు మరో గట్టి సవాలు ఉంది.ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలుసు. దానికి తోడు నిండా అప్పులు కూడా ఉన్నాయి. దీనితో జగన్ ఈ ఒక్క 100 కోట్లతోనే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి బాట పట్టిస్తారో అన్నది చాలా కీలకమైన అంశంగా మారింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎలా ఇచ్చేది.జగన్ చెప్తున్నా హామీలు ఎలా నెరవేర్చేది? ఇంకా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు లక్షల మందికి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి నెలకు 5000 ఇచ్చి పోషించేది కేవలం ఈ ఒక్క 100 కోట్లతో ఇదంతా సాధ్యమయ్యే పనులేనా అంటూ రకరకాల ప్రశ్నలు ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు జగన్ పరిస్థితి మాత్రం కత్తి మీద సాము వంటిదే అని చెప్పాలి.
Top