నలభై వేల కోట్లు ఉంటే ... అని అసలు విషయం చెప్పిన జగన్ !

Written By Siddhu Manchikanti | Updated: June 03, 2019 10:14 IST
నలభై వేల కోట్లు ఉంటే ... అని అసలు విషయం చెప్పిన జగన్ !

నలభై వేల కోట్లు ఉంటే ... అని అసలు విషయం చెప్పిన జగన్ !
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అలాగే తాను ప్రజలకు చెప్పినట్టు రాజన్న రాజ్యం నడిపించడానికి రాష్ట్ర ఆర్థిక ఖజానా కర్చు ఎంత అవుతుందని రాష్ట్ర అధికారులకు లెక్క చెప్పాలని ఆదేశించారట. దీంతో రాష్ట్రంలో ఉన్న అధికారులు జగన్ ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరాలంటే ఏడాదికి కనీసం 40 వేల కోట్లు ఉంటే గాని ఇచ్చిన హామీలు నెరవేరుతాయని లెక్కలతో సహా జగన్ కి చూపించినట్లు సమాచారం. ఇంకా ఏపీ ఆర్థిక అధికారులను ముఖ్యమంత్రి జగన్ కు ఇతర మార్గాలను నుండి ఆంధ్ర ఖజానాకు ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకోవాలి అన్న విషయంపై కూడా జగన్తో చర్చించినట్లు సమాచారం.
 
జగన్‌ కొత్తగా ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు కావలసిన రూ.6,265 కోట్లతో కలిపి అదనంగా దాదాపు 40 వేల కోట్లను సమకూర్చుకుంటేనే సజావుగా పాలన సాగుతుందని తేల్చారు. తాజా అంచనాల ప్రకారం ఖర్చు రూ. 238793 కోట్లు, ఆదాయం రూ. 1,98,977 కోట్లు ఉంటుందని అధికారులు జగన్ కు నివేదించారు. ఇక ఈ మొత్తం రెవెన్యూ లోటులో రూ. 17,500 కోట్ల వరకూ పూడ్చుకునే అవకాశం ఉందని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. కేంద్రం నుంచి రెవెన్యూ గ్రాంట్ గా రూ. 10 వేల కోట్లను పొందాలని, ఇసుకపై సీనరేజ్ విధించడం ద్వారా రూ. 2 వేల కోట్లు, నీటి పన్ను వసూలు ద్వారా రూ. 500 కోట్లు అదనంగా తేవచ్చని, రాష్ట్ర ఆదాయాన్ని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా మరో రూ. 5 వేల కోట్లను ఆదా చేయవచ్చని ముఖ్యమంత్రి జగన్ కి అధికారులు సూచించారట.
Top