తెలంగాణా లో ఉప ఎన్నికలు ! కే‌సి‌ఆర్ ఎలా డీల్ చెయ్యబోతున్నారు !

Written By Siddhu Manchikanti | Updated: June 03, 2019 10:18 IST
తెలంగాణా లో ఉప ఎన్నికలు ! కే‌సి‌ఆర్ ఎలా డీల్ చెయ్యబోతున్నారు !

తెలంగాణా లో ఉప ఎన్నికలు ! కే‌సి‌ఆర్ ఎలా డీల్ చెయ్యబోతున్నారు !
 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి అందరి ఊహలకు మించి మెజార్టీ స్థానాలు గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూపించిన జోరును చూపించలేక 16 స్థానాలకు గాను 9 స్థానాలు గెలుచుకొని సైలెంట్ అయిపోయారు. దీంతో పార్లమెంట్ స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ వెనుకబడి పోవడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు అధికార పార్టీ టీఆర్ఎస్ పై ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేస్తూ అప్పుడే కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత మొదలైంది అంటూ నానా హడావుడి సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలవడం జరిగింది.
 
ఈ సందర్భంగా పార్లమెంటు స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడంతో..తాను ప్రస్తుతం హుజూర్నగర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ మరియు ప్రతిపక్ష పార్టీలు...తెలంగాణ లో జరగబోయే ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించిన క్రమంలో..జరగబోయే ఉప ఎన్నికలు ఎలా డీల్ చేస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నారు.
Top