ఎల్లో మీడియా మీద సోషల్ మీడియా ఘనా విజయం ఇది ?

Written By Siddhu Manchikanti | Updated: June 03, 2019 10:21 IST
ఎల్లో మీడియా మీద సోషల్ మీడియా ఘనా విజయం ఇది ?

ఎల్లో మీడియా మీద సోషల్ మీడియా ఘనా విజయం ఇది ?
 
ఒకప్పుడు అనగా సోషల్ మీడియా రాకముందు ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది వార్త ప్రసారమవుతుందో అదే నిజమైన వార్త అని అందరూ నమ్మేవారు. అయితే సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రజలు బాగా గ్రహిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా దాదాపు ప్రసారమయ్యే న్యూస్ చానల్స్ లో 99 శాతం న్యూస్ ఛానల్ చంద్రబాబుకి అండగా ఉంటాయని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఉన్న రాజకీయ నేతలందరూ కామెంట్ చేస్తుంటారు. ఇందుమూలంగా నే టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా గాని ...సదరు న్యూస్ ఛానల్స్ అనగా ఎల్లో మీడియా చానల్స్ వాటిని ప్రజల దృష్టిలో కరెక్ట్ అనే విధంగా కథనాలు ప్రసారం చేస్తాయి అని..చాలా మంది రాజకీయ నేతలు పేర్కొంటుంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఎల్లో మీడియా డ్రామాలు ఎవరు కూడా అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నమ్మలేదని వచ్చిన ఫలితాలను బట్టి తేలిపోయింది.
 
ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై పోరాడుతున్న జగన్ కూడా ముందునుండి ఎన్నికల ప్రచారంలో తన పాదయాత్రలో ఎల్లో మీడియా ఈక్వల్ టు తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు అన్న విధంగా తన ప్రసంగాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో మరియు అదే విధంగా సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ చాలా యాక్టివ్గా ఉండటం తో చాలా వాస్తవాలు సోషల్ మీడియాలో ని బయటకు రావడంతో దీంతో చివరాఖరికి జరిగిన ఎన్నికలలో వైసీపీ పార్టీ చరిత్రను సృష్టించే విధంగా గెలవడంతో ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన గెలుపుని ఎల్లో మీడియా పై సోషల్ మీడియా ఘనవిజయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top