కొట్టాడు గా ఫస్ట్ బాల్ లోనే సిక్సర్!

Written By Siddhu Manchikanti | Updated: June 04, 2019 12:36 IST
కొట్టాడు గా ఫస్ట్ బాల్ లోనే సిక్సర్!

కొట్టాడు గా ఫస్ట్ బాల్ లోనే సిక్సర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న సమస్యలు మరియు ప్రజలకు ఏ విధమైన మెరుగైన పరిపాలన ఇవ్వాలో అన్నదానిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్..తాజాగా ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో ఏ విధంగా వైద్యాన్ని అందించలో వంటి విషయాల గురించి అధికారుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ఆశ వర్కర్ల జీతం మూడు వేల నుండి 10 వేలకు పెంచుతున్నట్లు గా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తాను చేసిన పాదయాత్రలో ప్రతి చోటా ఆశా వర్కర్లు వచ్చి తమ బాధను వెల్లడించడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు..అంతేకాకుండా ఆశా వర్కర్లకు పాదయాత్రలో ఈ హామీ ఇచ్చినట్లు తేలడంతో జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం బట్టి జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మాటమీద నిలబడి ఆశావర్కర్లు మాకు ఎంత మంచి ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మాటమీద నిలబడే ముఖ్యమంత్రి అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ దూకుడు చూస్తున్న రాజకీయ విశ్లేషకులు ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి బాల్ సిక్స్ అన్నట్టుగా ఉన్నాయని చాలా హుందాగా నష్టం లో ఉన్న రాష్ట్రం లో కష్టంలో ఉన్న ప్రజలకు అద్భుతమైన నిర్ణయాలతో మంచి పరిపాలన అందిస్తున్నారని కితాబిస్తున్నారు.
Top