జేసీ వెళ్లిపోతే రాయలసీమ లో రాజకీయం పరిస్తితి ఏంటి ?

Written By Siddhu Manchikanti | Updated: June 04, 2019 12:37 IST
 జేసీ వెళ్లిపోతే రాయలసీమ లో రాజకీయం పరిస్తితి ఏంటి ?

జేసీ వెళ్లిపోతే రాయలసీమ లో రాజకీయం పరిస్తితి ఏంటి ?

రాయలసీమ రాజకీయాలలో అనంతపురం జిల్లాలో జెసి బ్రదర్స్ కి మంచి పేరు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల సమయంలో అనంతపురం పార్లమెంటు స్థానం నుండి గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాలలో జేసీ దివాకర్ రెడ్డి స్టైలే వేరు. ముక్కుసూటిగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వంటివి చేసే జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడికి తలనొప్పులు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ జగన్ కొట్టడంతో..జేసీ దివాకర్ రెడ్డి శాశ్వత రాజకీయాల నుండి తప్పుకోవడానికి రెడీ అయిపోయారు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రకటిస్తూ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ..తాను ఏ పార్టీలో చేరనని….విశ్రాంతి తీసుకుంటానని వివరించారు. అందులో భాగంగానే జిల్లా అధికారులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మామూలుగా అయితే ఎన్నికలకు ముందు కూడా.. జేసీ తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించారు. అయితే రాయలసీమ ప్రాంతంలో కీలకంగా ఉండేది జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల నుండి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది రాయలసీమ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
Top