రవి ప్రకాష్ కి షాక్ ల మీద షాక్ లు?

Written By Siddhu Manchikanti | Updated: June 04, 2019 12:38 IST
రవి ప్రకాష్ కి షాక్ ల మీద షాక్ లు?

రవి ప్రకాష్ కి షాక్ ల మీద షాక్ లు?

ఫోర్జరీ కేసు లో ఇరుక్కున్న టీవీ9 రవి ప్రకాష్ కేసు ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. ముందస్తు బెయిల్ గా హైకోర్టును ఆశ్రయించిన రవి ప్రకాష్ కి అక్కడ చుక్కెదురు కావడంతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రవి ప్రకాష్ కి షాకుల మీద షాకులు ఇచ్చింది. ఫోర్జరీ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి ప్రకాష్ గత కొంత కాలం నుండి విచారణకు హాజరు కావాలి అంటూ తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించిన స్పందించలేదు. మరోపక్క ముందస్తు బెయిల్ పిటిషన్ కే రవి ప్రకాష్ హైకోర్టును అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తాజాగా రవిప్రకాష్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం...ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టును ఆశ్రయించాలని.. పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని రవిప్రకాష్ కు సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రవిప్రకాష్ తరుఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ముందస్తు బెయిల్ పై విచారణ జరిపించేలా హైకోర్టు ఆదేశించాలని సుప్రీం ను అభ్యర్థించారు. దీంతో సుప్రీం సమ్మతించి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని కోరింది. జూన్ 10లోపు ముందస్తు బెయిల్ పై విచారణ జరిపి ఆదేశాలివ్వాలని హైకోర్టును సూచించింది. అయితే ముందు పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని కోరింది. 41ఏ నోటీస్ కింద విచారణకు రవిప్రకాష్ హాజరుకావాల్సిందేనని సుప్రీం సూచించింది. అయితే పోలీసులు రవిప్రకాష్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చాకే ముందుకెళ్లాలని స్పష్టం చేసింది.
Top