ఆరోగ్య శ్రీ విషయం లో సడన్ డెసిషన్ తీసుకున్న జగన్ !

Written By Siddhu Manchikanti | Updated: June 04, 2019 12:39 IST
ఆరోగ్య శ్రీ విషయం లో సడన్ డెసిషన్ తీసుకున్న జగన్ !

ఆరోగ్య శ్రీ విషయం లో సడన్ డెసిషన్ తీసుకున్న జగన్ !

వైసిపి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలనలో తన మార్క్ ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్ళిపోతున్నరు. ముఖ్యంగా తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం తో రాజశేఖర్ రెడ్డి కి వచ్చినంత పేరు మరే పథకం ద్వారా ఎవరికీ రాలేదు. అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వెంటనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని పేరుమార్చి ఎన్టీఆర్ వైద్య సేవ గా పేరు పెట్టడం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి షరతులు వర్తిస్తూ పేదలకు కనీస వైద్యం అందకుండా చేశారని చాలామంది వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నాశనం చేశారని సీనియర్ రాజకీయ నేతలు చంద్రబాబు పరిపాలన పై కామెంటు చేస్తుండేవారు. అయితే తాజాగా ఆంధ్రా లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్ర అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన క్రమంలో ఇటీవల ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో భేటీ అయిన జగన్ సడన్గా షాకింగ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే ఎన్టీఆర్ వైద్యసేవగా కొనసాగుతున్న ఈ పథకాన్ని ఇకపై డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీగా మార్చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని మరింతగా విస్తరించే దిశగా జగన్ తనదైన శైలిలో సమీక్ష చేస్తున్నారు. ఇకపై ఎంత పెద్ద రోగం వచ్చినా... డబ్బులు లేవన్న కారణంగా ఏ ఒక్కరు కూడా ఇబ్బందిపడరాదన్న భావనతో ఉన్న జగన్... ఆ మేరకే ఈ పథకాన్ని మరింతగా విస్తరించే దిశగా యోచిస్తున్నారు. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ తానే చూసుకోవాలని కూడా జగన్ అధికారులతో తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం.
Top