ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు వెరైటీగా కృతజ్ఞతలు తెలుపుతున్నా వైసిపి ఎంపి నందిగామ సురేష్..!

ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు వెరైటీగా కృతజ్ఞతలు తెలుపుతున్నా వైసిపి ఎంపి నందిగామ సురేష్..!

ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు వెరైటీగా కృతజ్ఞతలు తెలుపుతున్నా వైసిపి ఎంపి నందిగామ సురేష్..!

ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు వివిధ వేషాలు వేస్తుంటారు. కొంతమంది ఊర్లో ఉన్న చెత్త ఎత్తు తారు...మరికొంతమంది ఇస్త్రీ చేస్తుంటారు ..ఇంకా రోడ్డు మీద పోస్తే ఆటో నడుపుతారు ఇలా రాజకీయ నాయకులు ప్రజలను ఓటర్లను ఆకర్షించడానికి నానా తంటాలు పడతారు. అయితే గెలిచిన తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తే వారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బాపట్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్. ఎంపీగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పలు పర్యటనల్లో పాల్గొన్నారు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఎంపీ నందిగం సురేష్.
బాపట్లలోని ఓ గ్రామంలో పర్యటిస్తున్న ఎంపీ నందిగం సురేష్ ఒక్కసారిగా ఛాయ్ వాలా అవతారం ఎత్తారు. ఒక కిరణా షాపులోకి వెళ్లిన ఆయన వారందరితో సరదాగా ముచ్చటించారు. అనంతరం కార్యకర్తలకు బిస్కెట్లు అమ్మారు.అనంతరం ఛాయ్ కూడా అమ్మారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే తాను అందరివాడినని, మీతోనే ఉంటానని తనను ఎప్పటి సురేష్ లాగేనే చూడాలంటూ ప్రజలకు చెప్పుకొచ్చారు ఎంపీ నందిగం సురేష్.Top