Advertisement

Advertisement

Advertisement

ఐఏఎస్, ఐ పి ఎస్ బదిలీల లో చంద్రబాబు, లోకేష్ బాబు మనుషులకు షాక్ ఇచ్చిన జగన్..!

by Siddhu Manchikanti | June 05, 2019 09:37 IST
 ఐఏఎస్, ఐ పి ఎస్ బదిలీల లో చంద్రబాబు, లోకేష్ బాబు మనుషులకు షాక్ ఇచ్చిన జగన్..!

ఐఏఎస్, ఐ పి ఎస్ బదిలీల లో చంద్రబాబు, లోకేష్ బాబు మనుషులకు షాక్ ఇచ్చిన జగన్..!

ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ ఉండేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అధికారులను రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి పనులను చేసిన అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు జగన్. ఇదిలా ఉండగా తాజాగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఒకేసారి 36 మంది ఐఏఎస్, అధికారులపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. అయితే ఈ బదిలీలలో సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఎలాంటి పోస్టింగులు ఇవ్వకపోవడం విశేషం. బదిలీలన్నీ చాలా వ్యూహాత్మకంగా చేశారని ప్రచారం జరుగుతుంది. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ పేషీల్లో, వారి శాఖల్లో పనిచేసిన వారిలో అత్యధిక శాతం ఐఏఎస్ లకు పోస్టింగ్ లు దక్కలేదు. గతంలోనే చంద్రబాబు నాయుడు పేషీల్లో పనిచేసిన సతీష్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్ లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే నేడు విడుదలైన ఉత్తర్వుల్లో వారికి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందేమోనని ఆశగా ఎదురుచూశారు. అయితే గతంలో చంద్రబాబు పేషీలో పనిచేసిన గిరిజా శంకర్ కుమాత్రమే పోస్టింగ్ దక్కింది మిగిలిన సతీష్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళిలకు ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వని పరిస్థితి. అలాగే సీఆర్డీఏలో పనిచేసిన వారికి కూడా పోస్టింగ్ లు ఇవ్వలేదు. సీఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన శ్రీధర్ ను కూడా జీఏడీకి అటాచ్ చేశారు.
వీరేకాదు ట్రాన్స్ కో, జెన్ కోలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులైన అజయ్ జైన్, విజయానంద్ లకు సైతం ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వలేదు ఏపీ సర్కార్. అలాగే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా ఉన్న అనురాధకు సైతం పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి అటాచ్ చేసింది. ఆమె స్థానంలో కిషోర్ కుమార్ ను హోంశాఖ సెక్రటరీగా నియమించింది.వీరితోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులైన కార్తీకేయ మిశ్రా, ఉదయలక్ష్మీ, శశిభూషణ్, కన్నబాబు, రంజిత్ బాషాలకు సైతం ఎలాంటి పోస్ట్ లు ఇవ్వలేదు. వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. పరిపాలన యంత్రాంగాన్ని ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేశారు. అందులో భాగంగా దాదాపు 50మంది ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థాన చలనం కల్పించారు. జిల్లాలకు సంబంధించి తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నాలుగు జిల్లాల కలెక్టర్లపై ఎలాంటి వేటు వేయలేదు.మెుత్తానికి ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చాలా కసరత్తు చేశారని తెలుస్తోంది.


Advertisement


Advertisement

Top