పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రజల ఆలోచనలు వేరుగా ఉన్నాయి : కేటీఆర్

Written By Siddhu Manchikanti | Updated: June 05, 2019 09:38 IST
పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రజల ఆలోచనలు వేరుగా ఉన్నాయి : కేటీఆర్

పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రజల ఆలోచనలు వేరుగా ఉన్నాయి : కేటీఆర్

దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలు చాలా వేరుగా ఉన్నాయని..అందువల్లనే తాను ఆశించిన స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో రాణించలేకపోయిన ని ఓపెన్ గా కామెంట్ చేశారు కేటీఆర్. జరిగిన పార్లమెంటు ఎన్నికలలో 16 స్థానాలను గెలుస్తామని ఆశించినా అలా జరగలేదు. అప్పుడు దేశం మూడ్‌ అంతా ఒకలా ఉంది. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకున్నారో ఏమో గానీ బీజేపీని గెలిపించారని ఆయన చెప్పారు.15, 20 రోజుల తేడాతో జరిగిన రెండు ఎన్నికల్లో ప్రజల ఆలోచనా విధానం ఎందుకు మారిందనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌, దేశస్థాయిలో మోదీ ఉండాలని కోరుకున్నారో ఏమో.. తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేస్తామంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఖండించారు. ఒక్క ఎన్నికలో గెలవగానే ఎగిరెగిరి పడొద్దని, అది సంస్కారం కాదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన బీజేపీ, ప్రస్తుతం ఆరు సీట్లు మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు.
Top