ప్రశాంత్ కిషోర్ కి అతిపెద్ద ఛాలెంజ్?

Written By Siddhu Manchikanti | Updated: June 08, 2019 10:18 IST
ప్రశాంత్ కిషోర్ కి అతిపెద్ద ఛాలెంజ్?

ప్రశాంత్ కిషోర్ కి అతిపెద్ద ఛాలెంజ్?

2014 దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మోడీ దేశ ప్రధాని అవ్వటానికి గల కారణాలలో ముఖ్య కారణం ప్రశాంత్ కిషోర్. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో తన రాజకీయ సలహాదారుడిగా ప్రశాంత్ కిశోర్ ని ఏర్పాటుచేసుకుని మోడీ చేసిన రాజకీయం ప్రశాంత్ కిషోర్ తో వేసిన రాజకీయ అడుగులు బీజేపీ పార్టీని కేంద్రంలో ఏ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేసింది. అంతేకాకుండా బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణం లో కూడా ప్రశాంతి కిషోర్ కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ గెలవడానికి ఓకే కారణం ప్రశాంత్ కిషోర్ అండ్ టీం అని కూడా చెప్పవచ్చు. ఇదిలావుండగా తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ ని తన రాజకీయ సలహాదారుడిగా అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ వ్యూహకర్తగా ఎంచుకున్నట్లు సమాచారం.
 
ప్రస్తుతం కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ ఇదే స్పీడు పశ్చిమ బెంగాల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూపించాలని తహతహలాడుతున్నారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా కేంద్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి తలనొప్పులు తెచ్చి పెట్టినా మమతా బెనర్జీ కి ఇటీవల కేంద్రంలో బిజెపి పార్టీ గెలిచిన తర్వాత పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ కి తలనొప్పిగా మారారు బిజెపి పార్టీ కార్యకర్తలు నేతలు. ఇటువంటి క్రమంలో పశ్చిమ బెంగాల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్ ని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తున్న క్రమంలో పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ గెలిపించడం ప్రశాంత్ కిషోర్ కి అతిపెద్ద ఛాలెంజ్ అనే రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.
Top