'బెల్టుషాపుల బెండు తీయండి' అంటున్న నూతన సీఎం జగన్…!

Written By Siddhu Manchikanti | Updated: June 08, 2019 10:31 IST
'బెల్టుషాపుల బెండు తీయండి' అంటున్న నూతన సీఎం జగన్…!

'బెల్టుషాపుల బెండు తీయండి' అంటున్న నూతన సీఎం జగన్…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న క్రమంలో అలాగే పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ పార్టీ అధినేత జగన్ గ్రామంలో బెల్టుషాపులు లేకుండా చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో చాలామంది రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు తమ భర్తలు తాగుడికి బానిస అయ్యి కుటుంబాలను పట్టించుకోవడం మానేశారని జగన్ కి తమ బాధలు చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా పూర్తిగా మద్యపాన నిషేధాన్ని 2024 ఎన్నికలు వచ్చే సమయానికి చేస్తామని ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
 
తాజాగా ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు కార్యాచరణ సిద్దం చేస్తోన్న కమిషనర్ ఎంకే మీనా. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోన్న ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ శాఖ అధికారులు.. సిబ్బందితో భేటీ అయిన రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, కమిషనర్ ఎంకే మీనా. బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులు.. సిబ్బందికి ఆదేశం. బెల్ట్ షాపుల నియంత్రణ కార్యాచరణ మొదలు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన సాంబశివరావు, ఎంకే మీనా. బెల్ట్ షాపుల నియంత్రణ చర్యలపై ప్రతి రోజూ స్టేషన్ల వారీ నివేదికలు ఇవ్వాలని ఆదేశం. గ్రామానికో కానిస్టేబుల్... మండలానికో ఎక్సైజ్ ఎస్ఐలను బాధ్యులుగా చేస్తామన్న ఉన్నతాధికారులు. బెల్ట్ షాపుల నియంత్రణలో చక్కటి పనితీరు కనబర్చిన సిబ్బందికి రివార్డులుంటాయని ఉన్నతాధికారుల స్పష్టీకరణ. గంజాయి రవాణను అరికట్టే విషయంలోనూ ఫోకస్ పెట్టాలని ఎక్సైజ్ సిబ్బందికి సాంబశివరావు, ఎంకే మీనా ఆదేశం.
Top