ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ పార్టీలకు వాటికంటూ సొంతంగా మీడియా కవరేజ్ వుంది. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలకు దీటుగా ఎదుగుతున్న జనసేన పార్టీ కూడా మీడియా రంగంలోకి దిగింది. గతంలో 99 టీవీ ఛానల్ నీ తన పార్టీ కార్యకలాపాల కోసం పవన్ కళ్యాణ్ వెనక ఉండి నడిపిస్తున్నారని అనేక వార్తలు రావడం జరిగాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణంగా ఓడిపోవడంతో పైగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా ఓడిపోవడంతో అందరూ షాక్ తిన్నారు. ఇటువంటి సమయంలో ఓడిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు.
సొంత న్యూస్ పేపర్ ఒకటి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ వార్తా పత్రికలో జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను... కార్యకలాపాలను మరియు అదే విధంగా ప్రణాళికలను హైలెట్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు పార్టీలో వినబడుతున్న టాక్. అంతేకాకుండా ఓడిపోయిన తరువాత మొట్టమొదటి సారి ఇటీవల విజయవాడలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఓటమికి గల కారణాలను ఆ రెండు నియోజకవర్గాలలో తన పార్టీకి చెందిన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి తెలుసుకున్నారట. ఈ క్రమంలో రానున్న ఎన్నికల లోపు ఎలాగైనా పార్టీకి మీడియా కవరేజ్ మరియు ఒక పత్రిక ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లు సమాచారం.