గవర్నర్ తో సడన్ గా భేటీ అయిన చంద్రబాబు..?

గవర్నర్ తో సడన్ గా భేటీ అయిన చంద్రబాబు..?

గవర్నర్ తో సడన్ గా భేటీ అయిన చంద్రబాబు..?
 
గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టానుసారం అయినా కామెంట్లు చేసేవారు. ఒక దశలో అయితే నరసింహన్ వద్దకు రావడానికే చంద్రబాబు ఇష్టపడలేదని అంటారు. కాని అదికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రత్యేకంగా గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా ఉంది.
 
అంతేకాదు... చాలా సేపు వారి మద్య చర్చలు జరిగాయి. రాజకీయంగా ఎదురైన పరిణామాలు తదితర అంశాల గురించి చంద్రబాబు ప్రస్తావించి ఉండవచ్చని భావిస్తున్నారు. కేంద్రం వైపు నుంచి కాని, ఎపిలో జగన్ ప్రబుత్వం నుంచి కాని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏమైనా గవర్నర్ ద్వారా ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.Top