రాజకీయాలలో ఏదైనా పదవి ఆశిస్తే, లేదా వస్తుందని తెలిసినా, ఆయనపై విమర్శలు చేసేవారు. పొగిడేవారు బాగానే ఉంటారు. పొగడ్తలతో ఇబ్బంది లేదు కాని, ద్వేషంతో వచ్చే కామెంట్లు సంబందిత నేతకు ఇబ్బందిగా మారుతాయి. తాజాగా మాజీ ఎమ్.పి వైవిసుబ్బారెడ్డి ఇలాంటి సమస్యను ఎదుర్కుంటున్నారు. ఆయన పేరు టిటిడి చైర్మన్ పదవి కి పరిశీలనలో ఉందని వార్తలు రావడంతో ఆయన వికీపేజీలో కొందరు మార్పులు చేసే యత్నం చేశారు. అందులో అంతకుముందు ఆయన మతం గురించి ప్రస్తావన లేకపోయినా, ఒకరు దానికి యాడ్ చేస్తూ క్రిస్టియన్ అని చేర్చారట.
దానిని వెంటనే మరొకరు మార్చి హిందూ అని స్పష్టం చేశారట. ఈ రకంగా అటు, ఇటూ తొంభై ఐదు సార్లు మార్చారట. అంతేకాక సోషల్ మీడియాలో చర్చ కూడా సాగించారట. దీనికి తోలుగుదేశం పార్టీ కూడా తన వంతు యత్నం చేసింది. చివరికి ఈ గొడవ పడలేక వికీ పేజీ ని లాక్ చేశారట.కాగా సుబ్బారెడ్డి తాను తొలి నుంచి హిందువునని, తన ఇంటిలో గోపూజ జరుగుతుందని, తన మెడలో ఉన్న స్వామివారి లాకెట్ తదితర వాటిని చూపిస్తూ టీవీలతో మాట్లాడారు.