ఎన్నికల గురించి సంచలన కామెంట్స్ చేసిన జనసేన అధినేత పవన్..!

ఎన్నికల గురించి సంచలన కామెంట్స్ చేసిన జనసేన అధినేత పవన్..!

ఎన్నికల గురించి సంచలన కామెంట్స్ చేసిన జనసేన అధినేత పవన్..!
 
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విజయవాడ నగరం లో అడుగు పెట్టి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు రూపొందించాలి ఇలాంటి విషయాలపై పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల కోసం ఆరంబమైన పార్టీ కాదని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల పార్టీ నేతలతో సమావేశం జరిపారు.ఎన్నికలు పద్దతిగా జరిగి ఉంటే పలితాలు మరో విదంగా ఉండేవని అనడం విశేషం.
 
ఇతర పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు రూ.150 కోట్లు దాటిందని, జనసేన ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసిందని పవన్‌ చెప్పారు. జనసేన నాలుగేళ్ల క్రితం పోటీ చేసినట్లయితే ఇంకా బలం పెరిగేదని ఆయన అన్నారు. మహిళలు, యువతీ, యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, అందుకే ఇన్ని లక్షల ఓట్లు వచ్చాయిని పవన్ కళ్యాణ్ అన్నారు.Top